నెల్లూరుగా మేయర్‌గా దేవరకొండ సుజాత ఎన్నిక
Published on: Thu Feb 26, 2026 6:10PM
.webp)
నెల్లూరు నగరంలో మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత నూతన మేయర్‌గా ఎన్నికయ్యారు. జేసీ వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రారంభమైన ప్రత్యేక సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. వైసీపీ కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరుకాలేదు.
టీడీపీ తరఫున మేయర్ అభ్యర్థిగా దేవరకొండ సుజాత పేరును ఇంచార్జ్ మేయర్ రూప్ ప్రతిపాదించగా, ఇతరుల నుంచి ఎలాంటి నామినేషన్లు రాకపోవడంతో పోటీ లేకుండా ఆమెను మేయర్‌గా ప్రకటించారు. ఈ సందర్భంగా జేసీ వెంకటేశ్వర్లు అధికారికంగా ఫలితాన్ని వెల్లడించారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, “నూతన మేయర్‌గా దేవరకొండ సుజాతను ఎన్నుకున్నాం. నగర కార్పొరేషన్‌పై టీడీపీ జెండాను ఎగురవేశామని. మంత్రి పీ. నారాయణ సూచనల మేరకు సుజాతకు ఈ అవకాశం కల్పించాం” అని తెలిపారు.
మేయర్‌గా ఎన్నికైన దేవరకొండ సుజాత స్పందిస్తూ, “ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాల మేరకు నగర కార్పొరేషన్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్తాను. ఎస్టీ మహిళకు మేయర్ పదవి కల్పించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.ఈ ప్రక్రియతో నెల్లూరు నగరానికి నూతన మేయర్ బాధ్యతలు స్వీకరించగా, నగర అభివృద్ధిపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.


