దేవాలయాల అభివృద్ధికి కృషిచేస్తా- రామచంద్రయ్య
Published on: Sat Jan 28, 2012 3:06PM
హై
దరాబాద్: దేవాదాయశాఖ మంత్రిగా రామచంద్రయ్య బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తనకు కేటాయించిన ఛాంబర్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ బొత్సా, చిరంజీవితో పాటు పలువురు నేతలు, అభిమానులు హాజరయ్యారు. రామచంద్రయ్యకు అభినందనలు తెలిపారు. తనపై నమ్మకంతో దేవాదాయశాఖ అప్పగించిన సీఎంకు రామచంద్రయ్య కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. రాష్ట్రంలో దేవాలయ భూములను పరిరక్షిస్తానని, తన తొలి ప్రాధాన్యం అదేనని అయన చెప్పారు. రాష్ట్రంలోని గ్రామాల్లో గల దేవాలయాల్లో కూడా నిత్యం ధూపదీప నైవేద్యాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అర్చకుల సమస్యలు ప్రయత్నాలు చేస్తామని ఆయన చెప్పారు.


