TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దామోదర ఆమ్యామ్యా రూ.25వేలట?

Published on: Mon Oct 1, 2012 8:53AM

Deputy Chief Minister, Damodara Raja Narsimha, Bribe 25,000/-, Signature, CM Kiran Kumar Reddy, Congress High Command,

డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ ఆమ్యామ్యాలతో రాష్ట్రంలో మంచి పేరు గడించారు. కనీసం రూ.25వేలు ఉంటేనే ఆయన సంతకం చేస్తారని, లేకపోతే ఫైలు వంకే చూడరని రాజనర్సింహపై ప్రచారం జరుగుతోంది. దీనిలో వాస్తవం పాళ్లు తెలుసుకునేందుకు ఓ ఖాయిలాపడి మూసివేతకు గురైన సంస్థను వాకబు చేస్తే నిర్వహించుకోలేక నష్టాలతో సంస్థ మూసివేయటానికి పెట్టిన ఫైలుపై రాజనర్సింహ సంతకం చేయనన్నారని విశ్వసనీయ సమాచారం. ఆ సంస్థ ఆయన్ను కలిస్తే రూ.25వేలు ఇస్తేనే ఆ సంతకం చేస్తానన్నారట. అదేంటీ అంటే నష్టాల్లో ఇదీ నష్టమనుకోమని రాజనర్సింహ సమాధానం ఇచ్చారని ఆ సంస్థ యజమాని వాపోయారు. అసలు రాజనర్సింహ అడ్డాకు సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రారని తెలిసింది. తన ఆమ్యామ్యాల గురించి ఎప్పుడైనా ప్రశ్నిస్తే సిఎంను కూడా తూలనాడతారని తెలిసింది. ఆ రోజు ఎప్పుడూ లేని విధంగా సిఎంవైఖరిపై రాజనర్సింహ కొత్త ప్రకటనలు వెలువరిస్తారని చెప్పుకుంటున్నారు. తన జోలికి వస్తే పరిస్థితి మరింత సీరియస్‌గా ఉంటుందని సిఎంను హెచ్చరించారని తెలిసింది. దీంతో సిఎం కూడా ఇతర ఒత్తిడులకు తోడు రాజనర్సింహతో తలనొప్పులు ఎందుకని మౌనం వహించినట్లు తెలిసింది. అయితే రాజనర్సింహ అవినీతి సమాచారం కాంగ్రెస్‌ అధిష్టానానికి చేరింది. దీంతో అధిష్టానం ఈయన విషయంలో సీరియస్‌గా పరిగణిస్తోందని తెలిసింది. కొత్తగా ఏ కళాశాల మంజూరు కావాలన్నా రూ.40లక్షల వరకూ డిమాండు చేస్తున్నారని ఓ కళాశాల నిర్వాహకుడు రాజనర్సింహ అవినీతి గురించి వివరించారు.