TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అక్కడ బురఖా వేసుకుంటే పదివేల జరిమానా

Published on: Fri Jun 1, 2018 11:22AM

డెన్మార్క్‌ దేశంలో బురఖా వేసుకుని తిరిగితే అక్షరాలా పదివేల రూపాయల జరిమానాను విధించే అవకాశం ఉంది. మొహాన్ని పూర్తిగా కప్పుకునే బురఖా మాత్రమే కాదు, కళ్ల వరకు కనిపించే నఖాబ్‌ను ధరించినా జరిమానా తప్పదు. బురఖా వేషంలో నేరాలు చేయడాన్ని అడ్డుకునేందుకే ఇలాంటి జరిమానా విధించినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి కఠినమైన నిబంధన ఇప్పటికే మరికొన్ని ఐరోపా దేశాలలో అమలులో ఉంది. ఫ్రాన్స్‌, బెల్జియం దేశాలలో ఇలాంటి కఠిన చట్టాలే అమలవుతున్నాయి. వాటికి ఐరోపా మానవహక్కుల కమీషన్ ఆమోదించింది కూడా!