TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అర్ధరాత్రి డెలివరీ బాయ్స్ హంగామా!

Published on: Wed May 27, 2026 12:32PM

హైదరాబాద్ పాతబస్తీలో  ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డబీర్‌పురా ప్రధాన రహదారి బ్రిడ్జి సమీపంలోని జెప్టో వేర్‌హౌస్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. డెలివరీలకు ఉపయోగించే ప్లాస్టిక్ ట్రేలు  సరుకుల కోసం కాకుండా… ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు ఆయు ధాల్లా మారిపోయాయి. చిన్న  వివాదం కాస్తా   పెద్ద గొడవగా మారడంతో  జెప్టో  డెలివరీ బాయ్స్ గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడుతూ రచ్చ రచ్చ చేశారు.  

వేర్‌హౌస్ బయట భారీగా అరుపులు, కేకలు వేస్తూ.. ట్రేలు విసురుకుంటూ హంగామా సృష్టిస్తుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  సమాచారం అందుకున్న పోలీసులు  అక్కడికి చేరుకుని డెలివరీ బాయ్స్‌ను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘర్షణ వ్యక్తిగత వివా దమా?  డ్యూటీలు, డెలివరీ టైమింగ్స్ విషయంలో తలెత్తిన తగాదానా..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.