లైట్ తీసుకోకండి.. ఢిల్లీని కాపాడుకోండి.. బెదిరింపు లేఖలు

 

ఇంతకు ముందు ఆగ్రాలోని తాజ్ మహల్ ను పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ను హెచ్చరిస్తూ యూపీలోని వారణాసిలో ఉగ్రదాడులు చేస్తామంటూ లేఖలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా అలాంటి బెదిరింపు లేఖలే వచ్చాయి. మీరట్ పోలీసులకు లేఖలు చేరడం ఇప్పుడు కలకలం రేగుతోంది. వివరాల ప్రకారం.. భిక్షాటన చేసే ఓ వ్యక్తి మీరట్ పోలీసులకు లేఖలు అందించాడు. అందులో ‘మూడు వాహనాల్లో ఉగ్రవాదులు వచ్చారు. ఇప్పటికే ఘజియాబాద్‌ కు చేరుకున్నారు. దిల్లీని కాపాడుకోండి. ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటే లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది’ అంటూ హెచ్చరించారు. ఆ తరువాత లేఖలు ఇచ్చిన అతన్ని అడుగగా... ఓవ్యక్తి తన వద్దకు వచ్చి పది రూపాయలు ఇచ్చి ఈ లేఖను పోలీసులకు ఇవ్వాలని కోరాడని.. అందుకే తాను ఇచ్చానని చెప్పాడు. ఇప్పుడు ఈ లేఖలకు గాను పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ లో ఉన్నారు. లేఖలపై విచారణ చేపట్టారు. మరోవైపు మీరట్, ఘజియాబాద్, వారణాసి, ఢిల్లీ తదితర ప్రధాన పట్టణాల్లో భద్రతను పెంచారు.