TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీ గ్యాంగ్ రేప్ : ఇండియా గేట్ వద్ద ఉద్రిక్తత

Published on: Sat Dec 22, 2012 2:11PM

 

 

 

ఓ మెడికల్ స్టూడెంట్ రేప్ కు గురైన సంఘటనతో దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్ననిరసన ప్రదర్శనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ ఘటన ఫై ఆందోళన చేస్తున్న విద్యార్దులు రాష్త్రపతి భవన్ ను ముట్టడించడానికి ప్రయత్నించారు.

 

ఈ ఉదయం లక్షలాది మంది విద్యార్దులు, ఉద్యోగులు ఇండియా గేట్ వద్ద జరిపిన ప్రదర్శన ఉద్రిక్తతకు దారి తీసింది. అక్కడ నుండి వారు రాష్త్రపతి భవన్ వైపు వెళ్ళే ప్రయత్నం చేయడంతో పోలీసులు భాష్ప వాయువు, వాటర్ కేనాన్స్ ప్రయోగించాల్సి వచ్చింది.

 

 

రేప్ సంఘటనను కాంగ్రెస్ అదినేత్రి సోనియా గాంధీ తేలిగ్గా తీసుకున్నారని అరవింద్ కేజ్రివాల్ పార్టీ ‘ఆం ఆద్మీ పార్టీ’ విమర్శించింది. ఈ కారణంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆమె నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ వరుస సంఘటనలతో ఢిల్లీ లోని ప్రముఖుల నివాసాల ముందు అధికారులు భద్రతను పటిష్టం చేశారు.