మహిళ చేతికి పార్లమెంట్ భద్రత...
Published on: Tue Feb 2, 2016 4:47PM

పార్లమెంటరీ భద్రతా దళమైన "శశాస్త్ర సీమ బల్" (ఎస్ఎస్ వి) కు డైరెక్టర్ జనరల్ గా ఒక మహిళా ఐపీఎస్ అధికారి ప్రప్రథమంగా నియమితులయ్యారు. అర్చనా రామ సందరంను ఈ పదవిలో నియమిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినేట్ అపాయింట్ మెంట్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రామ సుందరం ప్రస్తుతం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ గా ఉన్నారు. 1980 బ్యాచ్ కి చెందిన ఈ ఐపిఎస్ అధికారి తమిళనాడు క్యాడర్ కిందకి వస్తారు.


