బస్సులో గ్యాంగ్ రేప్ : నిందితులు అరెస్ట్
Published on: Tue Dec 18, 2012 2:22PM

ఢిల్లీ లో మెడికల్ స్టూడెంట్ పై జరిగిన హత్యాచారం కేసుకు సంబంధించి కీలక నిందుతుడిగా భావించిన బస్సు డ్రైవర్ రామ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. రామ్ సింగ్ చెప్పిన సమాచారం ప్రకారం, బస్సులో ఆతను స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా...అతని సోదరుడు ముఖేష్ బస్సును డ్రైవ్ చేస్తున్నాడు.
బస్సు సిగ్నల్ వద్ద ఆగగానే మెడికోలు బస్సు ఎక్కారు. తాగిన మైకంలో ఉన్న రామ్ సింగ్ అతని స్నేహితులు మెడికోలను ఇబ్బంది పెట్టారు. ఆ తరువాత విద్యార్ధిని పై రెండు సార్లు హత్యాచారం చేసి, విద్యార్ధిని బాయ్ ఫ్రెండ్ ని రాడ్ తో కొట్టి బస్సులో నుంచి బయటకు తోసివేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో చెప్పాడు.
రామ్ సింగ్ ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు అతని సోదరుడు ముకేష్ తో పాటు మరో ఆరుగురు నిందుతులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మెడికో పరిస్థితి విషమంగానే ఉంది. వెంటిలేటర్ పైనే ఆమెకు చికిత్స అందిస్తున్నారు.


