TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మురళీ సెంచరీతో మూడోసారి పైనల్ కు చేరిన చెన్నై

Published on: Sat May 26, 2012 10:48AM

ఐపిఎల్ లో రెండో క్వాలిఫయర్‌లో మురళీ విజయ్ 58 బంతుల్లో 15 ఫోర్లు, నాలుగు భారీ సిక్సర్లతో 113 పరుగులు చేసి చెన్నైను వరుసగా మూడోసారి పైనల్ కు చేర్చాడు. చెపాక్ స్టేడియంలో శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై 86 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తుచేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు సాధించింది.



కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి మూడో ఓవర్‌లోనే గట్టి షాక్ ఎదురైంది. హిల్ఫెన్హాస్ బౌలింగ్‌లో ప్రమాదకర ఓపెనర్ వార్నర్ (3) అవుటయ్యాడు. అలాగే ఈ సీజన్‌లో తొలిసారి వన్‌డౌన్ దిగిన సెహ్వాగ్ (1) సైతం ఆ తర్వాతి ఓవర్‌లో ఆల్బీ మోర్కెల్ అవుట్ చేయడంతో ఢిల్లీ నిరాశలో మునిగింది. అన్నింటా విఫలమైన ఢిల్లీ 136 పరుగులకు కుప్పకూలి భారీ ఓటమితో లీగ్ నుంచి నిష్ర్కమించింది.