TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీని వణికిస్తున్న ఒమిక్రాన్.. సీఎం కేజ్రీవాల్ కు కొవిడ్ 

Published on: Tue Jan 4, 2022 9:22AM

దేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఢిల్లీలో టెస్ట్ పాజిటివ్ రేటు ఏడు శాతంగా ఉంది. ఇది మరింతగా పెరిగవచ్చని తెలుస్తోంది. ఢిల్లీలో సోమవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 4,099 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు ప్రస్తుతం 6.46 శాతంగా ఉన్నట్టు అధికారులు  కేసులు ఈ స్థాయిలో పెరగడానికి ఒమిక్రాన్ వేరియంటే కారణమని భావిస్తున్నారు.

పాజిటివ్ రేటు 10 శాతానికి చేరితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో నమోదవుతున్న కొత్త కేసుల్లో 80 శాతానికి పైగా ఒమిక్రాన్ ఉండటం మరింత ఆందోళన కల్గిస్తోంది. ఒమిక్రాన్ వైరస్ సామాజిక వ్యాప్తి జరిగిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ఈ ఉదయం స్వయంగా ట్వీట్ చేసి వెల్లడించారు. తనకు వైరస్ సోకిందని తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో హోం ఐసోలేషన్‌లోకి వెళ్లినట్టు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు అప్రమత్తంగా ఉండాలని, ఐసోలేషన్‌లో ఉండడంతోపాటు టెస్టులు చేయించుకోవాలని కోరారు. కేజ్రీవాల్ కరోనా బారినపడడంతో పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారానికి కొంతకాలం పాటు బ్రేక్ పడనుంది.