TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పంజాబ్ పై ఢిల్లీ క్యాపిటల్ విజయం.. డీసీ ప్లేఆఫ్ ఆశలు సజీవం

Published on: Tue May 12, 2026 5:54AM

ఐపీఎల్ లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక విజయాన్ని సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. .  గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో  పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసింది.  ధర్మశాల వేదికగా   జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాళ్లు సమష్టిగా రాణించి పంజాబ్‌  పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల స్కోరు సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య, స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించారు.  

211 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన  ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది.   10 పరుగుల దగ్గర ఐదు పరుగులు చేసిన అభిషేక్ పోరెల్  అవుట్ కాగా..  కొద్దిసేపటికే కేఎల్ రాహుల్   కూడా 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.  ఆ తర్వాత వచ్చిన సాహిల్ పరాఖ్ 11 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్12 పరుగులు కూడా  వెనుదిరగడంతో 74 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది.  అయితే కెప్టెన్ అక్షర్ పటేల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మార్కస్ స్టోయినిస్ వేసిన 13వ ఓవర్‌లో వరుసగా  మూడు ఫోర్లు బాది జోరు పెంచిన అక్షర్ పటేల్ 30 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు రెండు సిక్సర్లతో56 పరుగులుచేశాడు.   

మరోవైపు   డేవిడ్ మిల్లర్ కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే హాఫ్ సెంచరీ చేసిన మరుసటి బంతికే  పెవిలియన్ చేరడంతో మ్యాచ్ మళ్ళీ ఉత్కంఠగా మారింది. చివరిలో  ఢిల్లీ విజయానికి 18 బంతుల్లో 36 పరుగులు అవసరమైన వేళ అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ అద్భుతం చేశారు. 18వ ఓవర్‌లో: రెండు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో 19 పరుగులు రాబట్టగా, 19వ ఓవర్‌లో: ఏకంగా 22 పరుగులు బాది జట్టును విజయతీరాలకు చేర్చారు.