TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీ బ్రోకర్లను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారు: కేసీఆర్  

Published on: Sun Oct 30, 2022 5:41PM

ఢిల్లీ బ్రోకర్ల ను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారు. ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనాలని చూశారు. మేము అంగట్లో పశువులము కాదని సీఎం కేసీఆర్ అన్నారు. చండూరులో బహిరంగ సభ కేసీఆర్ మాట్లాడుతూ వందల కోట్ల డబ్బుతో ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి.. ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఇవాళ త‌న‌తో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు హైదరాబాద్‌ నుంచి మునుగోడు వచ్చారు. నిన్నామొన్న కొంత మంది ఢిల్లీ బ్రోకర్‌గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్నే కొందామని.. మీకు వంద కోట్ల రూపాయలు ఇస్తాం.. మీరు పార్టీ విడిచిపెట్టి రమ్మని వాళ్ల‌ని ఎడ‌మ‌ కాలి చెప్పుతో కొట్టి అమ్ముడుపోవుడు కాదురా.. మేం అంగట్లో సరుకు కాదు.. తెలంగాణ బిడ్డలమని.. తెలంగాణ ఆత్మగౌర బావుటాను హిమా లయ పర్వతం అంత ఎత్తుకు ఎత్తారని తెలంగాణా మ‌ఖ్య‌మంత్రి ఎంతో గ‌ర్వంగా ప్ర‌క‌టించారు.
  
తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రెగా కాంతారావు లాంటివారు కావాలి రాజకీయాలకు. జాతి గౌరవాన్ని, దేశగౌరవాన్ని అంగట్లో పశువుల్లా అమ్ముడు పోకుండా.. వందకోట్లు ఇస్తామన్నా గడ్డిపోచతో సమానంగా విసిరికొట్టి తెలంగాణను కాపాడిన బిడ్డలు. వందల కోట్ల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను, పార్లమెంట్‌ సభ్యులను, ఇతరులను సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కొలగొట్టే అరాచక వ్యవస్థ మంచిదా? అని ప్రశ్నించారు.

 ప్రధాని మోదీకి ఇంకా ఏం కావాలి.. మోదీ రెండుసార్లు ప్రధానిగా చేసి కూడా.. ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నా రు? అని కేసీఆర్ ప్రశ్నించారు. అవసరం లేకుండా మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని విమర్శించారు. మునుగోడు ప్రజలు ఫలి తాలను ఎప్పుడో తేల్చేశారని స్పష్టం చేశారు. ప్రజలు ఆలోచించుకుని ఓట్లు వేయాలని, ఒళ్లు మర్చిపోయి ఓటేస్తే ఇల్లు కాలిపో తుం దని ఆయన హెచ్చరించారు. దోపిడీదారులు మాయమాటలు చెబుతూనే ఉంటారని, కరిసే పామును మెడలో వేసుకుంటా మా? అని కేసీఆర్ ప్రశ్నించారు.  

మ‌నం క‌ష్ట‌ప‌డి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, మెల్ల మెల్ల‌గా అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకుంటున్నాం. మంచినీటి స‌మ‌స్య తీరింది, సాగునీరు దిండి ప్రాజెక్టు నుంచీ రావాలి. ఆ ప్రాజెక్టు పూర్త‌వుతుంది. సిద్ధాంతాల్లో భేదాలు రావ‌చ్చు. ఓటు మాత్రం ఆలోచించి వేయాలి. ప్ర‌జ‌లు చైత‌న్యంతో ఉండాలని, దోపిడీ దారుల మాయ‌మాట‌లు విన‌వ‌న‌ద్ద‌ని హెచ్చ‌రించారు. ఢిల్లీ నుంచి వ‌చ్చిన దుర్మార్గులకు బుద్ధిచెప్పిన న‌లుగురు తెలంగాణా బిడ్డ‌ల్లా అంద‌రూ చైత‌న్య‌వంతులు కావాల‌ని కేసీఆర్ కోరారు. అక్ర‌మార్జ‌న‌తో ఎమ్మెల్యేల‌ను, ఎంపీల‌ను కొనేసి ప్ర‌భుత్వాల‌ను కొనే అరాచ‌క విధానం అనుస‌రించ‌డం సిగ్గుచేట‌ని, ప్ర‌ధానికి తెలీకుండానే ఇదంతా జ‌రిగిందా, అస‌లు ఆ తెచ్చిన సొమ్ము ఎవ‌రిది, ఎక్క‌డినించీ తెచ్చార‌ని, దాని వెనుక కీల‌క వ్య‌క్తి ఎవరో తేలాలి, ఆయ‌న రాజీనామా చేయాల‌ని తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. కొనేయ‌డానికి వ‌చ్చారు, జైలు పాల‌య్యార‌ని ఎద్దేవా చేశారు.  75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంత అరాచకం జరుగుతుంటే మనం మౌనంగా ఉందామా? ఆలోచించాలని కోరుతున్నాన‌ని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

విద్యావంతుడు తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం. దయచేసి మునుగోడులో విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, అన్నదమ్ముళ్లు, అక్కాచెళ్లెల్లు ఊరికి వెళ్లిన తర్వాత చర్చ చేయాలి. ఓటు వేసేటప్పుడు దేనికో ఆశపడి, ఎవడో చెప్పిండని మాయమాటకు లొంగి ఓట్లు వేస్తే మంచి జరుగదు. మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే రావు. చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలే. ఓటు వేసే టప్పుడు జాగ్రత్తగా వేయాలి. గాడుదలకు గడ్డేసి.. ఆవులు పిండితే పాలు రావు. గడ్డి వేసేటప్పుడే గాడిదికి వేస్తున్నామా? ఆవుకు వేస్తున్నమా? అని ఆలోచన చేయాల‌ని సీఎం కేసీఆర్‌ సూచించారు.

చేనేతలకు ఏ ప్రధాని చేయని దుర్మార్గం ప్రధాని మోదీ చేశారు. చేనేతలపై కేంద్రం 5శాతం జీఎస్టీ విధించింది. బీజేపీకి ఎందుకు ఓటేయాలని చేనేతలు ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే.. బీజేపీకి చేనేతల నుంచి ఒక్క ఓటు కూడా పోవద్దు. చేతిలో ఉన్న ఆయుధాన్ని ప్రజలు కాపాడుకోవాలి. కార్పొరేట్ల జేబులు నింపడానికే బీజేపీ పనిచేస్తోంది. విద్యుత్ సంస్కరణ ముసుగులో మీటర్లు పెడతారట. ఇళ్లల్లో మీటర్లు కూడా రూ.30వేలు పెట్టి మార్చుకోవాలట. ప్రలోభాలకు ఆశపడితే గోసపడేది మనమేన‌ని కేసీఆర్ హెచ్చరించారు. చేనేత కార్మికుల కుటుంబాలు పోరాటాలు చేయ‌ద్దు, ఓటు మాత్రం దేశం కోసం, మంచి కోసం, మంచి చేసేవారికే వినియోగించ‌డం.. బీజేపీ కి ఓటు వేయ‌ద్ద‌ని కేసీఆర్ సూచించారు. 

దేశంలో 4 ల‌క్ష‌ల మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి చేసే సామ‌ర్ధ్యం ఉంటే ప్ర‌బుత్వం కేవ‌లం 2 లక్ష‌ల మెగావాట్ల‌నే ఉత్ప‌త్తికి వీలు క‌ల్పిస్తోంది. ఇది దారుణం, ప్రైవేటీక‌ర‌ణ పేరుతో ధ‌నికుల‌కు కొల్ల‌గొట్ట‌డ‌మే త‌ప్ప దేశానికి చేస్తున్న‌దేమీ లేదు. ఇదంతా కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల ఫ‌లితం అన్న‌ది యువ‌త‌, విద్యావంతులు వారి నుంచి ప్ర‌జ‌లంతా తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉందని కేసీఆర్ అన్నారు.