TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీలో హై అలర్ట్‌.. హైదరాబాద్ లో నలుగులు అరెస్ట్

Published on: Fri Jan 22, 2016 11:45AM

దేశంలో ఈ మధ్య ఉగ్రవాదుల చర్యలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్‌ ప్రకటించారు. ఇంకో నాలుగు రోజుల్లో రిపబ్లిక్ డే రానున్న సందర్భంగా దేశ రాజధానిలో ఫుల్ ఎలర్ట్ ను ప్రకటించారు. మరోవైపు పఠాన్ కోట్ నుండి ముగ్గురు ఉగ్రవాదులు ఢిల్లీ బయలుదేరినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో క్యాబ్ డ్రైవర్ ని హత్య చేసి అదే క్యాబ్ లో ఢిల్లీకి బయలుదేరినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజధాని ఢిల్లీకి వచ్చే మార్గాలన్నింటిని కట్టుదిట్టం చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా వారు దాడులు జరపవచ్చని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఐబీ హైఅలర్ట్ ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా కార్యక్రమాలను భగ్న చేసేందుకు ఉగ్రవాదులు దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ లో నలుగురు అనుమానితులను అరెస్ట్ చేయగా మరో ఐదుగురికి కోసం గాలిస్తున్నారు. మొత్తం దేశ వ్యాప్తంగా 25 మంది ఐసిస్ అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.