ఢిల్లీ విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం
Published on: Sun May 7, 2017 6:37PM
.jpg)
ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన 9డబ్ల్యూ603 విమానం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళ్లాల్సివుంది. దీంతో విమానాన్ని మరల్చేందుకు పైలట్ ప్రయత్నించాడు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న మరో విమానం రెక్కకు జెట్ ఎయిర్‌వేస్ విమానం వెనుక భాగం తాకింది. ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు ఎలాంటి అపాయం జరగలేదు. ఘటనకు సంబంధించి అధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.


