బెయిల్ మీద వచ్చాడు... రేప్ చేసి వెళ్లాడు
Published on: Mon Jun 4, 2018 12:59PM

తీవ్రమైన నేర స్వభావం ఉన్నవారిని అదుపు చేయకపోతే ఏం జరుగుతుందో తెలియచేసే సంఘటన ఇది. ఢిల్లీకి చెందిన సందీప్ చౌహాన్ అనే వ్యక్తి మీద ఏకంగా రెండు డజన్ల కేసులు ఉన్నాయి. వాటిలో దొంగతనం, లైంగిక వేధింపులు, అత్యాచారం లాంటి తీవ్రమైన కేసులు కూడా ఉన్నాయి. అయినా కూడా పోలీసులు శుభ్రంగా అతనికి బెయిల్ ఇచ్చి బయటకి పంపారు. అదే అదునుగా భావించిన సందీప్ దారిన వెళ్తూ వెళ్తూ కనిపించిన ఇంట్లోకి చొరబడ్డాడు. అక్కడ ఉన్న అమ్మాయి మీద ఆరుగంటల పాటు అత్యాచారం చేశాడు. చివరికి ఆమెని గొంతు నులిమి చంపే ప్రయత్నం కూడా చేశాడు. కొన ఊపిరితో బయటపడిన బాధితురాలి కథనం మేరకు సందీప్‌ను తిరిగి అరెస్టు చేశారు.


