TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వస్త్రధారణపై దీపిక సంచలన కామెంట్స్

Published on: Sun Sep 14, 2014 9:39PM

 

‘ఫైండింగ్ ప్యానీ’ సినిమాలో దీపిక పదుకొనే వస్త్ర ధారణ విషయంలో వివాదం రేగింది. దీపిక తన వక్షోజాలు కనిపించేలా వస్త్రధారణ చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆమె ట్విట్టర్లో చాలా తీవ్రంగా స్పందించారు. ‘‘నేను మహిళను. నాకు వక్షోజ సౌందర్యం వుంటుంది. దానివల్ల మీకేంటి సమస్య’’ అని ట్విట్టర్లో విమర్శకులను ప్రశ్నించింది. అంతేకాకుండా మహిళలను గౌరవించడం చేతగాని వారు వారి గురించి మాట్లాడకుండా వుండటం మంచిదని సలహా ఇచ్చింది. దీపిక పదుకొనే ట్విట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఆమె ట్విట్స్‌కి భారీ స్థాయిలో స్పందన, మద్దతు లభించాయి.