గూండాలు నన్ను వేదిస్తున్నారు..
Published on: Mon Mar 13, 2017 10:38AM

జయలలిత వారసులినంటూ బయటకు వచ్చిన ఆమె మేనకోడులు దీపా జయకుమార్ ఏదో ఒక విషయంపై ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో అంశంపై ఆమె వార్తల్లో నిలిచారు. అదేంటంటే.. ఏప్రిల్ 12న ఆర్కే నగర్ నియోజక ఉప ఎన్నికలు జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్థానం నుండి దీపా జయకుమార్ కూడా పోటీ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆర్కే నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేయకూడదని వేధింపులు ప్రారంభమయ్యాయట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పుకొచ్చారు. ఆర్కే నగర్ స్థానం నుంచి పోటీ చేయాలని తాను ప్రకటించినప్పటి నుంచి వివిధ రకాలుగా తనను పరోక్షంగా వేధిస్తున్నారని...కనీసం తాను ఇంట్లో కూడా ఉండటం లేదని, తనకు వ్యతిరేకంగా పలువురు గూండాలు అక్కడికి వస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు వారు ఎవరి వర్గానికి చెందిన వారో కూడా తెలియడం లేదన్నారు. ఇదిలా ఉండగా జయలలిత మరణానంతరం ఆమె స్థానం ఖాళీ అయిన నేపథ్యంలో ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ స్థానం నుండి దీపా పోటీ చేస్తున్నారు. అంతేకాదు ఆమెకు ఆర్కే నగర్ వాసుల నుండి మద్దతు కూడా బాగానే లభిస్తున్నట్టు తెలుస్తోంది.


