TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇసుక సిండికేట్ లో గుంటూరు మంత్రి

Published on: Sat Mar 17, 2012 4:19PM

రాష్ట్రాన్ని మద్యం సిండికేట్లు అతలాకుతలం చేశాయి. అయితే ఇసుక సిండికేట్లు మాత్రం రాష్ట్రంలో చడీ చప్పుడు లేకుండా కోట్లాది రూపాయలు స్వాహా చేస్తున్నాయి. ఈ ఇసుక సిండికేట్ లలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వస్తుండటంతో మంత్రులు కూడా దీనిలో భాగస్వాములు అవుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో మూడు రీచ్ లలో జరిగే ఇసుక వేలంపాటల్లో జిల్లాకు చెందిన మంత్రి ఒకరు తన బినామీలతో పాల్గొనబోతున్నారు. దీనికై ఆయన ఇప్పటికే బోట్ మెన్ సొసైటీల పేరిట నాలుగు బోగస్ సొసైటీలను రిజిష్టర్ చేసినట్లు తెలిసింది. ఉండవల్లి, అమరావతి, తుళ్ళూరు, అచ్చంపేట, బాపట్ల, గొడవర్రు రీచ్ లకు ఈ నెల 27 న వేలం నిర్వహించబోతున్నారు. వీటిలో కాసులు కురిపించే మూడు రీచ్ లను హస్తగతం చేసుకోవడానికి జిల్లాకు చెందిన మంత్రి ఒకరు పావులు కడుపుతున్నారు. ఆయన ప్రయత్నాలు సఫలమైతే ఏడాదికి ఖర్చులు పోను సుమారు రూ. 30 కోట్లు మిగులుతాయని అంచనా వేస్తున్నారు.