TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డిసెంబర్ 23 నమ్మకద్రోహ దినంగా: కోదండరామ్

Published on: Sun Dec 18, 2011 8:01AM

హైదరాబాద్: ఈనెల 23వ తేదీన నమ్మక ద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. దీనిపై ఆయన మాట్లాడుతూ డిసెంబరు తొమ్మిదో తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటన చేసిన కేంద్రం ఆ తర్వాత సీమాంధ్ర పెట్టుబడుదారుల ఒత్తిడికి తలొగ్గి ఆ ప్రకటనను డిసెంబరు 23వ తేదీన వెనక్కి తీసుకుందన్నారు. అందుకే డిసెంబరు 23ను నమ్మక ద్రోహ దినంగా పాటించాలని పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఆ రోజున తెలంగాణ జిల్లాల్లోని అన్ని గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా, జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలని కోరారు.

ఇకపోతే తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా తెలంగాణలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించడానికి అనర్హుడన్నారు. తెలంగాణకు తాను అనుకూలమని ప్రకటన చేయకుండా గుండాలతో రైతులపై దాడి చేయాడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణకు నేను వ్యతిరేకం కాదనే వ్యాఖ్యలు తమకు అవసరం లేదని, తెలంగాణకు అనుకూలమనే ప్రకటన చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.