బీఏసీ సమావేశాల్లో కుదరని ఏకాభిప్రాయం

 

 

 

ఈ రోజు జరిగిన బీఏసీ రెండు సమావేశాల్లోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. మొదటి సారి ఉదయం ప్రారంభమైన బీఏసీ సమావేశం దాదాపు రెండుగంటలకుపైగా జరిగిప్పటికీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి గంటలకు మరోసారి భేటీ అవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సమైక్య తీర్మానానికి కట్టుబడి ఉన్నామని, తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టేవరకు సభ జరగనివ్వమని వైసీపీ స్పష్టం చేయగా, సమైక్య తీర్మానం అవసరం లేదని...టి.బిల్లుపై చర్చ జరుగుతుందని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు.

 

రెండో దఫా బీఏసీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం అర్దాంతరంగా ముగిసింది. రెండో సారి సమావేశం ప్రారంభమైన వెంటనే టీడీపీ నేతలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. బిల్లును తిరిగి పంపించేయాల్సిందే అంటూ సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు కోరారు.