TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రూ.50 వేల లంచంతో ఏసీబీకి చిక్కిన డీఈ

Published on: Mon May 25, 2026 4:06PM

 

వరంగల్ రేంజ్‌కు చెందిన ఏసీబీ అధికారులు మరో అవినీతి అధికారిపై ఉక్కుపాదం మోపారు. గంటి శ్రీకాంత్ అనే వ్యక్తి ప్రస్తుతం వరంగల్ జిల్లాలోని పాలకుర్తి లో నీటిపారుదల మరియు కమాండ్ ఏరియా అభివృద్ధి శాఖ (I&CAD)లో డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఫిర్యాదిదారుడు నిర్మించిన 10 డబుల్ బెడ్‌రూమ్ (2BHK) ఇళ్లకు సంబంధించిన తుది కొలతలను ఎం-బుక్స్‌లో నమోదు చేసి, బిల్లులు ప్రాసెస్ చేయడానికి ఆయన వద్దకు వచ్చాడు. 50 వేల రూపాయలు లంచంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. 

ఈ పనిని సెప్టెంబర్ 2022 నుంచి పెండింగ్‌లో ఉంచినట్లు వెల్లడించింది. దీంతో విసుగు చెందిన బాధితుడు లంచం ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ నేపథ్యంలోనే ఈరోజు భవాని నగర్  బాధితుడి నివాసానికి వచ్చిన శ్రీకాంత్ లంచం డబ్బులు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.తన అధికారిక విధులను నిజాయితీగా నిర్వహించకుండా అక్రమ ప్రయోజనం పొందేందుకు వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అనంతరం గంటి శ్రీకాంత్‌ను అరెస్టు చేసి, వరంగల్‌లోని ఎస్‌పీఈ & ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం కేసు దర్యాప్తులో కొనసాగుతోంది.