TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ లోకి కిరణ్.. డేట్ ఫిక్స్..!

Published on: Sat Jul 7, 2018 10:50AM

 

కాంగ్రెస్ అధిష్టానం ఏపీలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.. ఇప్పటికే పార్టీకి దూరమైన సీనియర్ నాయకులను తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తోంది.. దీనిలో భాగంగానే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ, మాజీ సీఎం కిరణ్ కుమార్ ని కలిశారు.. దీంతో కాంగ్రెస్ లోకి కిరణ్ రీఎంట్రీ అంటూ వార్తలు మొదలయ్యాయి.. కానీ కిరణ్ మాత్రం తన నిర్ణయాన్ని త్వరలో వెల్లడిస్తానంటూ చెప్పుకుంటూ వస్తున్నారు.. అసలు కిరణ్ కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇస్తారా? లేదా? అని మళ్ళీ డౌట్ మొదలైంది.. అయితే ఈ డౌట్స్ కి చెక్ పెడుతూ కొత్తగా ఒక వార్త వినిపిస్తుంది.. కిరణ్ కాంగ్రెస్ లో చేరే డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.. ఈ నెల 13న ఢిల్లీలో రాహుల్‌ సమక్షంలో జరిగే సమావేశంలో కిరణ్‌ పాల్గొంటారట.. ఆరోజే కిరణ్ చేరిక గురించి అధికారకంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.. మరోవైపు కిరణ్ తో పాటు మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే కిరణ్, కాంగ్రెస్ ని వీడి మరే పార్టీలో చేరని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర నేతలకు ఫోన్లు చేసి తిరిగి కాంగ్రెస్లో చేరదామని ఆహ్వానించినట్టు సమాచారం.