చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్లేస్, డేట్ ఫిక్స్!!

 

ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు కూడా ప్రధాన పార్టీలు ఆగేలా లేవు. టీడీపీ, వైసీపీ పార్టీల ఆత్రుత చూస్తుంటే ఫలితాలకు ముందే ప్రమాణస్వీకారం చేసేలా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం వైఎస్ జగన్ పేరుతో ఉన్న సీఎం నేమ్ ప్లేట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అది మరచిపోకముందే.. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అంటూ సోషల్ మీడియాలో తాజాగా మరో ఫోటో చక్కర్లు కొడుతోంది. ఓ జ్యోతిష్యుడు జగన్ ప్రమాణస్వీకారానికి మే 26 ఉదయం 9.29 గంటలు దివ్యమైన ముహూర్తమని చెప్పినట్లు ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే వైసీపీ కంటే మేమేమన్నా తక్కువా అంటూ.. టీడీపీ కూడా ప్రమాణస్వీకారానికి స్థలం, తేదీ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని టీడీపీ నేతలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు వచ్చిన రెండ్రోజులకు అంటే.. ఈ నెల 25న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని విశ్వసనీయవర్గాల సమాచారం.