TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ కు దాసోజు గుడ్ బై

Published on: Fri Aug 5, 2022 4:38PM

తెలంగాణ కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్. ఆ పార్టీ అధికార ప్రతినిథి దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ కు తగిలిన ఎదురుదెబ్బ నుంచి తేరుకోక ముందే రాష్ట్ర కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ కుమార్ రాజీనామా నిజంగా శరాఘాతమే.  మాజీ మంత్రి దివంగత పీజేఆర్ తనయ విజయారెడ్డి ఇటీవల తెరాసను వీడి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో ఆమెకు వచ్చే ఎన్నికలలో ఖైరతాబాద్ టికెట్ ఇస్తామని పీసీసీ పెద్దలు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారని భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

విజయారెడ్డి చేరికతో తనకు ఖైరతాబాద్ సీటు దక్కదన్న అనుమానంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన దాసోజు శ్రవణ్ పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ   నియోజకవర్గంలో చరుకుగా పని చేస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ తనకే దక్కుతుందని బావిస్తున్నారు.

అయితే విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరడం, ఆమెకే ఖైరతాబాద్ టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరగుతుండటంతో దాసోజు శ్రవణ్ కుమార్ మనస్తాపం చెంది పార్టీకి గుడ్ బై చెప్పారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.  దాసోజు శ్రవణ్ కుమార్ తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించారు.

ఆ తరువాత 2014లో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.  కాంగ్రెస్ ఆయనకు అధికార ప్రతినిథిగా సముచిత స్థానం ఇచ్చి గౌరవించింది.  2018లో ఖైరతాబాద్‌లో పోటీచేసి ఓడిపోయిన ఆయన ఈసారి ఎలాగైనా గెలవాలని క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్నారు. అయితే విజయారెడ్డి రాకతో తనకు టికెట్ దక్కే అవకాశం లేదన్న భావనతో కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.  నేడో రేపో ఆయన కమలం గూటికి చేరుతారని పరిశీలకులు అంటున్నారు.