TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దాసరిలేఖ :కిరణ్ పాలన భేష్

Published on: Fri Jan 13, 2012 4:19PM

హైదరాబాద్:ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పనితీరు భేషుగ్గా ఉందని కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడుదాసరి నారాయణ రావు అభిప్రాయపడ్డారు. ఇదే అంశాన్ని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తెలుపుతూ ఆయన శుక్రవారం మూడు పేజీల లేఖ రాశారు.ఇందులో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రిగా సీఎం పనితీరు బాగుందని అందువల్ల సీఎంగా ఆయననే కొనసాగించాలని కోరారు.పైపెచ్చు పార్టీలో గ్రూపిజం పెరుగుతోందని, దీన్ని అరికట్టాలని దాసరి తన లేఖలో కోరారు. ప్రధానంగా కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు కుట్ర జరుగుతోందని ఆ లేఖలో దాసరి ఆరోపించినట్టు సమాచారం.దాసరి  లేఖ రాయడం వెనుక కారణం లేకపోలేదు.దాసరి రాజ్యసభ సభ్యత్వం మార్చి నెలతో ముగియనుంది.