TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆయనొక ఆల్ రౌండర్: దాసరి

Published on: Fri Nov 15, 2013 9:24AM

 

ఎప్పుడు ఎదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ, తనదైన శైలిలో ఇండస్ట్రీపై విరుచుకుపడే దర్శకుడు దాసరి నారాయణరావు. అయితే ఈ మధ్య దాసరిలో చాలా మార్పు వచ్చినట్లుగా తెలుస్తుంది. శ్రీహరి మరణం వలన శ్రీహరి స్నేహితులు సికింద్రాబాద్ లో నిర్వహించిన సంస్మరణ సభకు దాసరి హాజరయ్యారు.

ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ... "కొంద‌రు ఏదో పుట్టాం. బ్రతికాం. వెళ్లిపోయం అన్నట్లు జీవితాన్ని గ‌డుపుతారు. కానీ కొద్దిమంది మాత్రమే పుట్టుకను సార్ధకం చేసుకుంటారు. అటువంటి వారిలో రియ‌ల్ స్టార్ శ్రీ‌హ‌రి ఒక‌రు. న‌టుడిగానే కాకుండా...మాన‌వ‌త్వం వున్న మ‌నిషిగా కూడా ఎన్నో సేవ కార్యక్రమాలు తన సొంత డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి చేశారు. ఇక నటుడిగా ఆయ‌న ఎస్వీఆర్ మాదిరిగా ఆల్ రౌండ‌ర్ గా ఎదుగుతున్న స‌మ‌యంలో చనిపోవడం.. తెలుగు ఇండ‌స్ట్రీకి తీర‌ని న‌ష్టం. శ్రీహ‌రి బ్రతికి వుంటే నిజంగా ఇంకో 20 ఏళ్లు న‌టించే వాడన్నారు. ఏది ఏమైన ఎస్వీఆర్ అంత‌టి వాడుగా ఎద‌గాల్సిన శ్రీ‌హ‌రిని ఇండ‌స్ట్రీ కోల్పోయింద‌ని దాసరి బాధ ప‌డ్డారు. వాస్తవానికి న‌టుడిగా శ్రీ‌హ‌రికి ఎవ‌రు వంక పెట్టలేరు. ఆయ‌నొక ఆల్ రౌండ‌ర్" అని అన్నారు.

అయితే ఈ విధంగానే దాసరి అన్ని వేదికలపై పాసిటివ్ గానే మాట్లాడితే బాగుంటుందని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.