శ్రీశైలంలో నేటి నుంచి దసరామహోత్సవాలు
Published on: Mon Sep 22, 2025 9:34AM
.webp)
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం(సెప్టెంబర్ 22) ప్రారంభమైన దసరామహోత్సవాలు వచ్చే నెల 2వ తేదీ వరకూ జరుగుతాయి. దసరా మహోత్సవాల సందర్భంగా మల్లన్న ఆలయాన్ని ముస్తాబు చేశారు. శ్రీశైలం క్షేత్రమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. శ్రీశైలం మల్లన్న ఆలయం లోపలి పరివార ఆలయాలు, ప్రధాన గోపురాలను కూడా కన్నుల పండువగా వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయం బయట స్వామి అమ్మవారు వహనసేవలో గ్రామోత్సవంగా విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చే ప్రధాన మాడవీధులు,రథశాలను కూడా అంగరంగవైభవంగా అలంకరించి ముస్తాబు చేశారు. సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి అక్టోబర్ 2వరకు 11 రోజులు పాటు దసరా దేవి శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. ఉదయం 9 గంటలకు స్వామి, అమ్మవారి యాగ శాల ప్రవేశంతో ఆలయ అర్చకులు, వేదపండితులు,ఈవో శ్రీనివాసరావు దసరా మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఇక సాయంత్రం అమ్మవారు శైలపుత్రిగా దర్శనమివ్వనున్నారు. అలానే స్వామి అమ్మవారు భృంగివాహనంపై గ్రామోత్సవంగా క్షేత్రపురవిధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన మివ్వనున్నారు.


