ఏపీ దసరా సెలవుల ప్రకటన!
Published on: Tue Oct 1, 2024 1:19PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం (అక్టోబర్ 3) నుంచి దసరా సెలవులు ప్రకటించింది. గురువారం (అక్టోబర్ 3) నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు.. ఏపీలోని విద్యాసంస్థలకు సెలవలు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా అక్టోబర్ 4 నుంచి దసరా సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం భావించినప్పటికీ పొరుగురాష్ట్రమైన తెలంగాణలో 3వ తేదీనుంచే దసరా సెలవలు ఇవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రుల వినతికి సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేష్ గురువారం నుంచే సెలవులు ప్రకటించారు.


