TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మైసూరుకు దీటుగా బెజబాడలో దసరా ఉత్సవాలు

Published on: Tue Sep 2, 2025 1:31PM

బెజవాడలో ఈ ఏడాది దసరా ఉత్సవాల సంబరాలు అంబరాన్నంటనున్నాయి. అసలు దసరా ఉత్సవాలకు బెజవాడ పెట్టింది పేరు. కనకదుర్గమ్మ బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉండటంతో ఇక్కడ ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అందులో సందేహం లేదు. సంప్రదాయబద్ధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఈ సంప్రదాయపద్దతికి ఆధునికతను జోడించాలని నిర్ణయించింది.

మైసూరు లో జరిగే దసరా ఉత్సవాలను తలదన్నేలా నిర్వహించాలని నిర్ణయించింది. విజయవాడ ఉత్సవ్ పేరుతో దసరానవరాత్రులలో నగర వ్యాప్తంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.  పున్నమి ఘాట్‌లో దాండియా, లైవ్ బ్యాండ్‌లు  వాటర్ స్పోర్ట్స్‌ తో పాటు గొల్లపూడిలో  30 ఎకరాలలో బ్రహ్మాండమైన ఎక్స్‌పోను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది  పది రోజుల దసరా ఉత్సవాలలో కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల కోసం రూపొందించిన ప్రత్యేక కార్యకలాపాలతో పాటు హెలి మరియు బెలూన్ రైడ్‌లను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

సంప్రదాయం, ఆధునికతల మేళవింపుతో దసరా ఉత్సవాలను నభూతో అన్నట్లుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నది.  ఈ ఉత్సవాలు బెజవాడ వాసులకు ఓ కొత్త అనుభూతిని మిగిల్చేలా ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది.