బాసరలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం!
Published on: Thu Oct 3, 2024 12:50PM

నిర్మల్ జిల్లా బాసరలో నేటి నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. సరస్వతీ దేవి ఈ రోజు శైలపుత్రి అలంకారంలో బక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పరిశీలించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, తాగునీటి సౌకర్యం, ఉచిత భోజన, వసతి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పండుగను విజయవంతం చేసేందుకు కృషిచేయాలన్నారు.


