TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బొట్టు కోసం ప‌ట్టు.. అమెరిక‌న్ ఆర్మీలో భార‌తీయుడు!

Published on: Wed Mar 23, 2022 12:11PM

బొట్టే కదాని తీసేస్తే.. అత‌న్ని త‌ప్పుబ‌ట్టే వారెవ‌రూ ఉండ‌రు. కానీ, అత‌ను బొట్టే క‌దాని తుడిపేసుకోలేదు. ప‌ట్టు బ‌ట్టి మ‌రీ ప్ర‌త్యేక ప‌ర్మిష‌న్ సాధించుకున్నాడు. భార‌తీయ సంత‌తి వ్య‌క్తిగా.. అమెరిక‌న్ ఆర్మీలో నుదుటిపై తిల‌కంతో గుర్తింపు పొందాడు. త‌న‌కు, త‌న సంస్కృతికి తిల‌కం ఎంత ప్ర‌త్యేక‌మో యావ‌త్ ప్ర‌పంచానికి చాటి చెప్పాడు. 

అత‌ని పేరు ద‌ర్శ‌న్ షా. భార‌త సంత‌తి వ్య‌క్తి. యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మ్యాన్‌గా చేస్తున్నాడు. అమెరికా ఆర్మీలో యూనిఫాం విష‌యంలో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఎలాంటి మ‌త చిహ్నాలు ధ‌రించ‌డానికి అనుమ‌తించ‌రు. అయితే, ద‌ర్శ‌న్ షా మాత్రం యూనిఫాంలో ఉన్న సమయంలోనూ నుదుటికి తిలకం పెట్టుకునేందుకు వాయుసేన నుంచి ప్రత్యేక అనుమతి పొందారు. ఇందుకోసం అనేక ఏళ్లుగా అధికారుల‌కు విజ్ఞ‌ప్తులు చేస్తూనే ఉన్నాడు. ఎట్ట‌కేల‌కు అది సాధించాడు. డ్యూటీలోనూ బొట్టు పెట్టుకునేందుకు ఆఫీస‌ర్ల‌ను ఒప్పించాడు.  ఇప్పుడు రెగ్యుల‌ర్‌గా తిలకంతో డ్యూటీకి హాజరవుతూ భార‌తీయ‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. 

"యూనిఫాంలో ఉన్నా తిలకం పెట్టేందుకు అనుమతించాలని మిలటరీ ట్రైనింగ్‌ స్కూల్‌లో ఉండగానే నేను కోరా. అయితే.. టెక్‌ స్కూల్‌కు వెళ్లాక ప్రయత్నించాలని వాళ్లు చెప్పారు. టెక్‌ స్కూల్‌లో ఇదే విషయం అడిగితే.. డ్యూటీలో చేరాక అక్కడి అధికారుల్ని సంప్రదించాల్సిందిగా సూచించారు. ఇన్నాళ్లకు నాకు అనుమతి లభించింది" అని దర్శన్ అంటున్నారు. ప్ర‌స్తుతం వ్యోమింగ్‌లోని ఎఫ్‌ఈ వారెన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో దర్శన్‌ పనిచేస్తున్నారు.