మళ్లీ టీఆర్ఎస్ వైపు చూస్తున్న దానం..?

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక ఆ పార్టీకి రాజకీయంగా ఎలాగూ తిరుగులేదు. ఇప్పుడు మిగిలిన పార్టీల పరిస్థితులో కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందునా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఒక పక్క తెలంగాణ వాదులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు అన్న పేరు ఉన్నా అది ఎందుకు పనిరాకుండా పోయింది. గ్రేటర్లో కేవలం రెండంటే రెండు స్థానాలను దక్కించుకోగలిగింది. అందుకే తమ ఓటమికి బాధ్యత వహించి కాంగ్రెస్ పార్టీ నేత దానం నాగేందర్ గ్రేట‌ర్ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసిన దానం ఇప్పుడేం చేస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంతమందైతే దానం మళ్లీ టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతారని అనుకుంటున్నారు.

ఇప్పటికే దానం కాంగ్రెస్ తరపు కార్యక్రమాలు వేటిలో పాల్గొనడంలేదు. అంతేకాదు పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తితో కూడా ఉన్నారు. దీనికి తోడు ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కూడా చిత్తుగా ఓడిపోయింది. ఇక ఇదే అదనుగా దానం కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వెళతారు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి దానం ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.