గ్రేటర్ అధ్యక్ష పదవికి దానం రాజీనామా..

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమికి బాధ్యతగా రాజీనామా చేస్తున్నానని అన్నారు. అంతేకాదు గ్రేటర్లో గెలిచిన కార్పోరేటర్లు అభ్యర్ధులందరికీ ధన్యవాదాలు తెలిపారు. మేం ఆశించిన ఫలితాలు రాలేదు.. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం.. టీఆర్ఎస్ హామీలకు ప్రజలు ఆకర్షితులయ్యారు.. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి..నాకు పూర్తి బాధ్యతలు ఇవ్వకపోయినా కష్టపడి పనిచేశా అని వ్యాఖ్యానించారు.