TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రకాశం బ్యారేజీకి డ్యామేజి.. కుట్రకోణంపై బలపడుతున్న అనుమానాలు!?

Published on: Sun Sep 8, 2024 7:22AM

కృష్ణానది చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీగా వరద వచ్చింది.  చరిత్రలోనే తొలిసారిగా గతంలో ఎన్నడూలేని విదంగా 12 లక్షల క్యూసెక్కుల వదర ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి  వచ్చింది.   ఆ సమయంలో అంటే ఈ నెల 1న భారీ మరపడవలు ఆ వరద ప్రవాహంలో వచ్చి ప్రకాశం బ్యారేసీ గేట్లను బలంగా ఢీ కొన్నాయి. బ్యారేజీ నుంచి దిగువకు నీరు వెళ్లే మార్గంలో అడ్డంగా చిక్కుకున్నాయి. దీంతో వరద ప్రవాహం దిగువకు వెళ్లేందుకు ఆటంకం ఏర్పడింది. బ్యారేజీకి కూడా నష్టం వాటిల్లింది. బ్యారేజీ రెండు గేట్లకు ఉన్న  కౌంటర్ వెయిట్లు ధ్వంసం అయ్యాయి. అప్పట్లోనే వరద నీటిలో ఒకే సారి నాలుగు బోట్లు కొట్టుకు రావడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ సంఘటన ప్రమాద వశాత్తూ జరిగింది కాదనీ.. ఎవరో ఉద్దేశపూర్వకంగా వదిలారనీ ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. గతంలో అంటే జగన్ హయాంలో కూడా ఇదే విధంగా వరద సమయంలో వరద ప్రవాహానికి అవరోధం కలిగి చంద్రబాబు నివాసం ముంపునకు గురయ్యేలా వైసీపీ ఓ బోటును అడ్డుగా పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ వద్ద వదర నీటిని అడ్డుకునేలా బోట్లు రావడంపై కూడా స్థానికులు నాటి ఘటనను గుర్తు చేస్తూ వైసీపీ కుట్ర కోణం ఉందన్న ఆరోపణలు చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు కూడా బోట్లు కొట్టుకురావడం వెనక కుట్రకోణం ఉందనే అంటున్నారు.  ఒకేసారి నాలుగు బోట్లు కొట్టుకురావడం అనుమానాస్పదంగా ఉందని అంటున్న ఇరిగేషన్, రివర్ కన్జర్వేటివ్ శాఖల అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.  

నిండా ఇసుకతో  ఉన్న మూడు బోట్లు వరద ప్రవాహానికి అడ్డంగా ప్రకాశం బ్యారేజీ గేట్లను డీకొన్న ఘటనపై ఒక పక్క పోలీసులు, మరో పక్క ఇరిగేషన్, రివర్ కన్జర్వేటివ్ శాఖల వేర్వేరుగా విచారణ జరుపుతున్నారు. ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గడంతో ఆ బోట్లను తొలగించి ధ్వంసమైన రెండు గేట్ల కౌంటర్ వెయిట్ల స్థానంలో వేరేవి అమర్చే పనులు శర వేగంగా జరుగుతున్నాయి. అది వేరే సంగతి. అసలు ఒకే సారి నాలుగు బోట్లు వరద ప్రవాహంలో కొట్టుకు రావడం వెనుక ఉన్న కుట్ర కోణం ఏమిటి? వాటిని ఏ అవసరాల కోసం వాడుతున్నారు? వరద తీవ్రంగా ఉన్న సమయంలో ప్రవాహంలోనికి వాటిని ఎవరు వదిలేశారు? అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇక ఆ బోట్లు  మాజీ ఎంపీ నందిగం సురేష్ కు చెందినవని ప్రాథమికంగా తేలింది. ఆ బోట్లను ఇసుక రవాణా కోసం వాడుతున్నారని చెబుతున్నారు. దీంతో ఈ ఘటన వెనుక   కుట్ర కోణంపై అనుమానాలు బలపడ్డాయి. కావాలనే బోట్లను ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టి భారీ నష్టం వాటిల్లితే.. ఆ నెపాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై నెట్టి రాజకీయ లబ్థి పొందాలన్న కుట్రతో ఉద్దేశపూర్వకంగానే వదిలేశారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది.