TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దళిత బంధు గ్రామంలో ఈటలకు లీడ్.. కెప్టెన్ గ్రామంలో కారు గల్లంతు 

Published on: Tue Nov 2, 2021 12:01PM

హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. గతంలో గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోనూ కమలం జోరు కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకం టీఆర్ఎస్ పార్టీకి గుది బండగా మారింది. దళితబంధు పథకాన్ని ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాలపల్లి గ్రామంలో ప్రారంభించారు. శాలపల్లి గ్రామస్తులు సైతం కేసీఆర్‌ను ఊహించని దెబ్బకొట్టారు. శాలపల్లి గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం కనబరిచారు.    

రాజ్యసభ్యులు కెప్టెన్ లక్ష్మీ కాంతరావు ఇలాఖాలో టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. ఇప్పటి వరకు ఆయన కుటుంబానికి మంచి పట్టున్న తుమ్మనపల్లి, బోర్పపల్లి గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు భారీ ఆధిక్యం వచ్చింది. ఈ గ్రామాల్లో ఈటలకు 350 ఓట్లకు పైగా లీడ్ వచ్చింది. హుజురాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలోనూ ఈటల 90 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఈ గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నప్పటికీ అదే సామాజిక వర్గానికి చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు అండగా నిలబడలేదు.