TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్టెయిన్ బౌలింగ్ అదుర్స్ : పాక్‌పై దక్షిణాఫ్రికా ఘనవిజయం

Published on: Mon Feb 4, 2013 5:20PM

 

 

 Dale Steyn bowls South Africa to victory, South Africa to big win over Pakistan

 

 

జోహెన్స్‌బర్గ్‌లో జరిగిన తొలి టెస్టు లో సౌత్ఆఫ్రికా ఘనవిజయం సాదించింది. రెండో ఇన్ని౦గ్స్ లో పాకిస్తాన్ 268 పరుగులకు ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికా మొదటి టెస్టులో 211 పరుగుల తేడాతో పాక్ పై గెలిచింది. మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

 

మొదటి టెస్టులో డేల్ స్టెయిన్ బౌలింగ్ పాక్ ఎదురునిల్వలేకపోయింది. తొలి ఇన్ని౦గ్స్ లో 49 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్, రెండో ఇన్ని౦గ్స్ లో 268 పరుగులకే ఆలౌటైంది. డేల్ స్టెయిన్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులకే ఐదు వికెట్లు సాధించాడు.


వికెట్ కీపర్ డివిలియర్స్ ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడంతో పాటు 11 క్యాచ్‌లతో ప్రపంచ రికార్డును సమం చేశాడు.  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అద్భుత బౌలింగ్‌తో రాణించిన స్టెయిన్‌కే దక్కింది.