వైసీపీ పొత్తుపై పురంధేశ్వరీ సంచలన వ్యాఖ్యలు...
Published on: Mon Mar 6, 2017 9:29AM

బీజేపీ-టీడీపీ పార్టీలు రెండు మిత్రపక్షమని అందరికీ తెలిసిందే. అయితే దీనిపై బీజేపీ నేత పురంధేశ్వరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలపై ఖండించిన ఆమె మాట్లాడుతూ.. బీజేపీలో తాను గౌరవంగానే ఉన్నానని, పార్టీ మారే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఇంకా టీడీపీతో ఉన్న మిత్రబంధం గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకూ అయితే టీడీపీ తో మిత్ర బంధం కొనసాగుతుందని.. కానీ భవిష్యత్తులో మాత్రం ఏం జరుగుతుందో చెప్పలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై ప్రస్తుతం తానేమీ చెప్పలేనని.....ఆ పార్టీతో స్నేహం తాను తీసుకునే నిర్ణయం కాదని, తమ పార్టీ సీనియర్లే తీసుకుంటారని అన్నారు. కాగా పురంధేశ్వరీ వైసీపీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


