TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

దాచేపల్లి ఘటనపై చంద్రబాబు ఆగ్రహం... పోలీసులకు ఆదేశాలు జారీ...!

Published on: Thu May 3, 2018 3:21PM

 

గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు. అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై అందోళన నిర్వహించారు. దీంతో దాదాపు 15 కిలోమీటర్లకుపైగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ దాచేపల్లిలో స్థానికులు స్వచ్ఛంద బంద్‌ పాటిస్తున్నారు. నిందితుడి ఇంటిని స్థానికులు ధ్వంసం చేశారు. ఇక ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అరాచకాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అంతేకాదు...పరారీలో ఉన్న నిందితుడిని పట్టిచ్చినవారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. వెంటనే దాచేపల్లికి వెళ్లాలని జిల్లా మంత్రులు, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు.

 

ఇక అత్యాచారానికి గురైన బాలికను వైద్యచికిత్సల నిమిత్తం గుంటూరు సర్వజనాస్పత్రిలో చేర్చించారు. బాధిత బాలికను జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని బంధువులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యసదుపాయం కల్పించాలని వైద్యుల్ని ఆదేశించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన కలెక్టర్.... ఈ ఘటన దురదృష్ణకరమని వ్యాఖ్యానించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.