డీఎస్ చూపు ఎటు వైపు..?

 

డీఎస్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ కవిత మరియు కొందరు నిజామాబాద్ తెరాస నేతలు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు వినతిపత్రం అందించిన సంగతి తెలిసిందే.. ఈ అంశంపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికి, తెరాస పట్ల అసంతృప్తిగా ఉన్న డీఎస్, పార్టీ ని వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే తిరిగి కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు వార్తలొచ్చాయి.. అలానే బీజేపీ లో చేరే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు అభిప్రాయపడ్డారు.. అయితే డీఎస్ మాత్రం ఇంతవరకు తన నిర్ణయాన్ని ప్రకటించలేదు.. తాజాగా డీఎస్ నగర శివారులోని కాంగ్రెస్ పార్టీ నేతకి చెందిన హోటల్లో.. ఆయన సన్నిహితులు, కార్యకర్తలతో సమావేశమైనట్టు తెలుస్తోంది.. ఈ సమావేశంలో భవిష్యత్తు రాజకీయ నిర్ణయం గురించి చర్చించారట.. దీన్ని బట్టి చూస్తుంటే కేసీఆర్ తన నిర్ణయం తెలపకముందే డీఎస్ తెరాసను వీడేలా ఉన్నట్టు కనిపిస్తోంది.. ఒకప్పుడు కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన డీఎస్, తెరాస లో చేరారు.. తెరాస మీద అసంతృప్తితో తిరిగి కాంగ్రెస్ లో చేరే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.. చూద్దాం ఏం జరుగుతుందో.