తీరాన్ని దాటిన హెలెన్ తుఫాన్

 

 

 

రాష్ట్రంలో తీవ్ర ఉగ్రరూపం దాల్చిన హెలెన్ తుపాను మచిలీపట్నం వద్ద ఈ రోజు మధ్యాహ్నం తీరం దాటినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో ఆరు గంటల్లో ఇది క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారుతుంది. ఈ వాయుగుండం ప్రభావం వల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. హెలెన్ తుపాను ప్రభావానికి రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో కోనసీమ ప్రాంతంలో విపరీతంగా నష్టంవాటిల్లినట్లు తెలుస్తోంది. మరోవైపు తీర ప్రాంత ప్రజలను అధికారులు పునరావాసకేంద్రాలకు తరలించిడంతో ప్రాణ నష్టం తప్పింది.

 

video courtesy;ETV 2