దిశ ఎన్ కౌంటర్ కు ముందు రోజు... డీజీపీతో సజ్జనార్ కీలక చర్చలు... పెద్దల గ్రీన్ సిగ్నల్ తర్వాతే..!


దిశ ఘటన జరిగిన 24గంటల్లోనే నిందితులను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు... ఆరోజే దాదాపు పూర్తి ఆధారాలు సేకరించారు. నిందితులు నేరం ఒప్పుకోవడం... దారుణానికి సంబంధించిన అన్ని ఆధారాలు లభించడం... టెక్నికల్ ఎవిడిన్స్ కూడా దొరకడంతో... అసలేం జరిగిందో... నిందితులు నేరం ఎలా చేశారో పూర్తి క్లారిటీకి వచ్చారు. దాంతో, నిందితులను పట్టుకున్న రోజే... ఎన్ కౌంటర్ చేస్తారని అంతా భావించారు. ఇక, సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు ఎన్ కౌంటర్లు చేసిన ట్రాక్ రికార్డు ఉండటం... వరంగల్ లో యాసిడ్ అటాక్ నిందితులను కాల్చిచంపిన చరిత్ర ఉండటంతో.... దిశ నిందితులకు కూడా అదే చివరి రోజు కావొచ్చని అనుకున్నారు. అయితే, దిశ కేసును సీరియస్ గా తీసుకున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్... ఆరోజే డీజీపీ మహేందర్ రెడ్డిని సంప్రందించినట్లు తెలిసింది. నిందితులను ఎన్ కౌంటర్ చేద్దామంటూ అడిగినట్లు సమాచారం. అయితే, తొందరపడొద్దని, అలా నిర్ణయాలు వద్దంటూ డీజీపీ సూచించినట్లు తెలుస్తోంది. దాంతో, చట్టపరకంగా ముందుకెళ్లారు.

అయితే, దిశ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు జరగడం... మరోవైపు తెలంగాణ పోలీసులపై విమర్శలు రావడం... ఢిల్లీ టూర్లో సీఎం కేసీఆర్ కు నేషనల్ మీడియా నుంచి చేదు అనుభవం ఎదురవడం... పార్లమెంట్లో తీవ్ర చర్చ జరగడంతో... అటు తెలంగాణ ప్రభుత్వం... ఇటు తెలంగాణ పోలీసులు... తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే గురువారం(డిసెంబర్ 5) డీజీపీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ తోపాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు... డీజీపీ మహేందర్ రెడ్డితో సమావేశమై అత్యంత గోప్యంగా చర్చలు జరిపారు. డీజీపీతో సైబరాబాద్ సీపీ సజ్జనార్ సమావేశమవడంపై కచ్చితమైన సమాచారమున్నా... అయితే, దేనిపై చర్చించారో తెలియనప్పటికీ... ఈ సమావేశం జరిగిన తర్వాతి రోజే దిశ నిందితులు ఎన్ కౌంటర్ కావడాన్ని బట్టి చూస్తుంటే.... పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే... పోలీసులు యాక్షన్ లోకి దిగి పని పూర్తిచేసినట్లు అంటున్నారు.