TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సెల్ ఫోన్ రిఛార్జ్ ఏజెంట్లపై సైబర్ నేరగాళ్ళ పంజా

Published on: Mon Feb 27, 2012 1:55PM

హైదరాబాద్: సైబర్ నేరగాళ్ళు అక్రమార్జనకు కొత్తపంథాను కనుగొన్నారు. సెల్ ఫోన్ రిఛార్జి  ఏజెంట్లను టార్గెట్ చేస్తూ వారిని మోసగించి నిత్యం లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు.


సెల్ ఫోన్ వినియోగదారుల సౌకర్యార్ధం సెల్యూలార్ కంపెనీలు తమ ఏజెంట్లకు ఈ-లోడు ద్వారా టాక్ టైమ్ పంపుతున్నాయి. టాక్ టైమ్ మొత్తం పంపిన సాయంత్రానికి వ్యాపారులు ఆ కంపెనీ ఏజెంటుకు సొమ్ము చెల్లించాలి. ఇందుకుగాను వ్యాపారులకు కంపెనీలు రెండు శాతం కమీషన్ ఇస్తున్నాయి. రిఛార్జి కూపన్లు కొనుక్కొని అందులోని నెంబర్లును ఫోన్ లతో ఫీడ్ చేసి రిఛార్జి చేసుకునే ఓపిక, అవగాహన లేనివారి ఈ-లోడు ద్వారా మొబైల్ ఫోన్లు రిఛార్జి చేసుకుంటున్నారు. అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్ళు ఇలాంటి వ్యాపారుల మీద కన్నెశారు. ఇంటర్నెట్ ద్వారా ఆయా కంపెనీకుల సంబంధించిన పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నవారి నెంబర్లు సేకరించారు. వారికి ఫోన్ చేసి ఏదో ఒక కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మిస్తున్నారు. తమ కంపెనీ వ్యాపారాభివృద్ధికి మీరు చేస్తున్న కృషికి గుర్తింపుగా మూడువేల నుంచి ఐదువేల దాకా ఉచితంగా టాక్ టైమ్ ఈ-లోడు ద్వారా పంపుతున్నట్లు చెప్పి వారిని మాయలో పడేస్తున్నారు. ఈ మొత్తం ఫోన్ లో జమ కావడానికి తాము చెప్పిన నెంబర్లకు ఫోన్ చేసి తాము చెప్పినంత మొత్తం ఈ-లోడు అయ్యేలా చేయాలని సూచిస్తూ వ్యాపారుల వద్ద వున్న రిఛార్జి మొత్తాన్ని లాగేస్తున్నారు. ఐదు నిమిషాల్లో మీకు అదనపు టాక్ టైమ్ జమ అయినట్లు మెసేజ్ వస్తుందని నమ్మిస్తున్నారు. తాము మాట్లాడిన నెంబర్లకు ఐదు నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే ఎత్తేవారు ఉండరు. అప్పటికి గాని తాము మోసపోయామనే విషయాన్ని వ్యాపారులు గుర్తించలేక పోతున్నారు.


రాష్ట్ర పరిధిలోని నెంబర్ కు ఈ-లోడు ద్వారా మొత్తం రీఛార్జి అయివుంటే తాము మళ్ళీ వెనక్కు తెప్పించే అవకాశం ఉందని, ఇతర రాష్ట్రాల నెంబర్లకు రిఛార్జి అయితే తామేమీ చేయలేమని కంపెనీల అధికారులు సమాధానం ఇస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని వ్యాపారులు నూటికి రెండు రూపాయలు కమీషన్ వచ్చే వ్యాపారానికి తాము వేల రూపాయలు నష్టపోవాలా అంటూ ఈ వ్యాపారానికి నమస్కారం పెడుతున్నారు.