TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

డీమార్ట్  పేరుతొ వాట్సాప్ మెసేజ్.. టచ్ చేసారో ఇక అంతే..   

Published on: Thu Feb 4, 2021 11:55AM

బ్యాంకులు, పోలీసులు జనాలను సైబర్ నేరాలపై ప్రతి రోజు హెచ్చరిస్తున్నా.. నేరగాళ్లు మాత్రం జనాల జేబులు కొల్లగొట్టేందుకు కొత్త కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం టాటా సంస్థ వాలెంటైన్స్ డే ఆఫర్ పేరుతో గాలం వేసిన సైబర్ నేరగాళ్లు.. తాజాగా డీమార్ట్ పేరుతో మరో కొత్త ప్లాన్ వేశారు. దేశంలోనే ప్రముఖ వ్యాపార సంస్థ అయినా డీమార్ట్ 20వ వార్షికోత్సవం సందర్భంగా మీ కోసం ప్రత్యేక అవకాశం కల్పిస్తోందంటూ సోషల్ మీడియాలో ఈపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ‘"ఒక్కసారి ఈ చక్రం తిప్పండి.. సూపర్ బహుమతి గెలుచుకునే అవకాశం దక్కించుకోండి" అంటూ జనాన్ని నమ్మిస్తున్నారు. దీంతో రూ.10వేల వరకు గిఫ్ట్ కార్డు పొందే అవకాశం ఉందని.. ఈ గిఫ్ట్ కార్డును ఏదైనా డీమార్ట్ స్టోర్‌లో షాపింగ్ చేస్తే రూ.10వేల వరకు ఈ ఉచిత కూపన్ ను వినియోగించుకోవచ్చని నమ్మబలుకుతున్నారు. ఈ మెసేజ్ ను ఐదు వాట్సాప్ గ్రూపులు, 20మంది స్నేహితులకు ఫార్వర్డ్ చేయాలని వారు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి మెసేజ్‌లను నమ్మితే తీవ్రంగా నష్టపోవడం ఖాయమని సైబర్ క్రైం పోలీస్‌లు తాజాగా హెచ్చరిస్తున్నారు. "రమణా.. ఖాతా ఖాళీ ఐపోతాది.." అంటూ సామాన్య ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తున్నారు.