TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెళ్ళయి 26 రోజులే అయింది.. అంతలోనే...

Published on: Thu Jul 17, 2014 9:26AM

 

తెలంగాణ ఉద్యమంలో కళాకారుడిగా తనవంతు పోరాటం చేసిన ఒక తెలంగాణ యువకుడు అనూహ్యంగా కరెంట్ షాక్‌తో మరణించాడు. అతనికి పెళ్ళయి కేవలం 26 రోజులు మాత్రమే అయింది. తెలంగాణలోని షాపల్లి గ్రామానికి చెందిన రాజు (24) తెలంగాణ ఉద్యమంలో కళాకారుడిగా చురుకుగా పాల్గొన్నాడు. రాజుకు 26 రోజుల క్రితం పెళ్ళి అయింది. డిగ్రీ పూర్తి చేసినప్పటికీ వ్యవసాయం మీద మక్కువతో పొలం పనులు చూసుకుంటున్న రాజు బుధవారం పొలంలో నాట్లు వేయించడానికి వెళ్ళాడు. అక్కడ మోటర్ పైపుకు కరెంటు ప్రవహిస్తున్న విషయాన్ని గమనించని రాజు పైపును పట్టుకోవడంతో తీవ్రమైన కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. పెళ్లయిన 26 రోజులకే రాజు మృతిచెందడంతో రాజు భార్య గుండెలు పగిలేలా రోదిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రాజు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.