భారీగా పెరిగిన కరెంట్ ఛార్జీలు.. యూనిట్‌కు ఎంతంటే...
Published on: Wed Mar 23, 2022 5:17PM
ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోయాయి. మధ్య తరగతి బతుకు బడ్జెట్ తలకిందులు అవుతోంది. కొవిడ్ తర్వాత దాదాపు అన్ని వస్తు, సేవలు విపరీతంగా పెరిగాయి. ఇవి చాలవన్నట్టు.. తాజాగా కరెంట్ ఛార్జీలు పెంచుతూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రజలపై గుదిబండ మోపింది.
పెంచడమంటే ఏదో పేరుకు ఎంతోకొంత పెంచడం కాదు. దొరికిందే ఛాన్స్ అంటూ.. భారీగానే బాదేసింది ఈఆర్సీ. ఏకంగా యూనిట్‌కు 50 పైసలు హైక్ చేసింది. ఇండస్ట్రీ సెక్టార్ అయితే యూనిట్‌కు 1 రూపాయి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ రోజు నుంచి జనాలను ఫూల్స్‌ను చేసేందుకు సిద్ధమైంది కేసీఆర్ సర్కారు.
డిస్కమ్‌లు ఐదేళ్ల విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలు కమిషన్ ముందుంచాయని, దీనిపై వినియోగదారుల అభిప్రాయాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఛైర్మన్ టి.శ్రీరంగారావు తెలిపారు. ‘‘2022-23 ఏడాదికి డిస్కమ్‌లు ప్రతిపాదించిన రెవెన్యూ గ్యాప్ రూ.16వేల కోట్లు. కానీ, రూ.14,237 కోట్ల రెవెన్యూ గ్యాప్‌ను కమిషన్ ఆమోదించింది. రెవెన్యూ అవసరాలు రూ.53వేల కోట్లుగా ఏఆర్‌ఆర్ ప్రతిపాదన. ఏఆర్‌ఆర్ ప్రతిపాదనలకు కమిషన్ రూ.48,708 కోట్లు ఆమోదించింది.’’ అని ఈఆర్సీ ఛైర్మన్ తెలిపారు.


