విజయనగరంలో కర్ప్యూ కొనసాగింపు

 

 

 

విజయనగరం జిల్లాలో కర్ప్యూ కొనసాగుతోంది. పట్టణంలో కనిపిస్తే కాల్చివేత వుత్తర్వులు ఇచ్చినట్లు పోలీస్ జిల్లా అదికారి కార్తికేయన్ చెప్పారు. జిల్లాలో ఆందోళనల నేపథ్యంలో కర్ప్యూ విధించిన ఆదివారం మధాహ్నం మళ్లీ ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద కొందరు ఆందోళనకారులు నిప్పు బంతులతో పోలీసుల పైకి దాడి చేసి తరిమేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలలో సిఆర్పీఎఫ్, బిఎస్ఎఫ్, బిఐఎస్ఎఫ్ పోలీసుల బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఆందోళనలు అదుపులోకి రావడం లేదు.

 

 

విజయనగరం జిల్లాకే పది కంపెనీల పారామిలటరీ దళాలను పంపించనున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. బొత్స విభజనకు అనుకూలంగా ఉన్నారనే ఆగ్రహంతో ఉన్న సమైక్యవాదులు ఆయన ఆస్తుల ధ్వంసమే లక్ష్యంగా వెళ్తున్నారు. గాజులరేగలో పోలీసులు నిరసనకారుల పైకి రబ్బర్ బుల్లెట్లు  ప్రయోగించారు.