హైదరాబాద్ పాతబస్తీలో కొనసాగుతున్న కర్ఫ్యూ
Published on: Tue Apr 10, 2012 10:53AM
హైదరాబాద్ పాతబస్తీలోనీ మాదన్నపేట, సైదాబాదులో మూడో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగించాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత పరిస్థితులు మాత్రం అదుపులోనే ఉన్నాయని, కర్ఫ్యూ మాత్రం కొనసాగుతుంది అని తెలిపారు. కర్ఫ్యూ కారణంగా పోలీసులు వాహనాల రాకపోకలకు అనుమతించడం లేదు. సోమవారం పరీక్షలు, ఇతర అత్యవసరాలు ఉన్న వ్యక్తులకు పోలీసులు అనుమతించారు. పాతబస్తీలోనీ అల్లర్లలకు కారణమైన నాయకులపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే అల్లర్లకి కారణమైన 59 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నెల 14వ తేది వరకు ఆ రెండు ప్రాంతాల్లో 144వ సెక్షన్ కొనసాగించాలని పోలీసులు నిర్ణయించారు.


