కేసీఆర్ కీరా సూపర్

 

అది హైదరాబాద్‌లో జరుగుతున్న ఉద్యానవన ప్రదర్శన. ఆ ప్రదర్శనలో చాలామంది రైతులు తాము పండించిన పంట శాంపిల్స్‌ని ఉంచారు. ఆ ప్రదర్శన చూడ్డానికి వచ్చిన వాళ్ళందరి ఐస్ ఐస్కాంతం పెట్టి లాగినట్టుగా ఒక వైపుకు తిరుగుతున్నాయి. అందరి కళ్ళూ తిరుగుతున్న చోట అందంగా నిగనిగలాడుతున్న కీరాలు వున్నాయి. ఆ కీరాలు కళ్ళకు నచ్చుతూ వుండటంతో జనాల కాళ్ళు కూడా ఆ కీరాల వైపు లాగుతున్నాయి. అందరూ ఆ కీరాల దగ్గరకి వెళ్తూ, ఏ రైతు వీటిని కష్టించి పడించాడో.. చాలా సూపర్‌గా వున్నాయి.. ఆ రైతుకు హ్యాట్సాఫ్ అనుకుంటున్నారు. కీరాల దగ్గరకి వెళ్ళి ఇంత అద్భుతమైన కీరాలు పండించిన రైతు ఎవరా అని కీరాల మీద వున్న కాగితాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఆ కీరాలు పండించింది మరెవరో కాదు... మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. మెదక్ జిల్లాలోని సహదేవ్‌పూర్ మండలంలో వున్న ఎర్రవల్లి గ్రామంలో కేసీఆర్ పండించిన రిజ్వాన్ జాతికి చెందిన యురోపియన్ కుకుంబర్లు అవి. ఇంత చక్కటి కీరాలను పండించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ని అందరూ మనసులోనే అభినందించుకుంటున్నారు. అన్నట్టు.. కేసీఆర్ పండించారు అంటే ఆయనేదో పొలంలోకి దిగి పండించారని అపార్థం చేసుకోవద్దని మనవి.