జవాన్లపై దాడి.. ఉగ్రవాదుల్లో బాలుడు

దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో నిన్న సీఆర్‌పీఎఫ్ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాదులు భద్రతా బలగాలను టార్గెట్‌గా చేసుకోని గ్రనేడ్లతో దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే తేరుకున్న సైన్యం ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియలో భాగంగా చనిపోయిన వారిలో పదో తరగతి చదువుతున్న బాలుడు కూడా ఉన్నట్లు సైన్యం గుర్తించింది.

 

ఇతను ఓ పోలీస్ అధికారి కుమారుడట.. కొన్ని నెలల క్రితమే జైషేలో చేరాడట. కాల్పులు జరుగుతున్న సమయంలో ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడట. కొన్ని నెలల క్రితమే ఈ శిబిరంపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాం.. ఈ సందేశం మీకు అందేసరికి నేను దేవుడి దగ్గర చేరిపోయి ఉంటాను. మీరు కూడా జైషే‌ మహ్మాద్ సంస్థలో చేరండి అంటూ పేర్కొన్నాడు.